Felicitation to Golden Era Music Director Sri Rajan(Nagendra)garu
March 1st 2018- Blessed to be a part of “Veena Venuvaina Sarigama Vinnava..” concert on the occasion of Lifetime achievement Award and presenting Ghantasala Swarnakankanakam to Golden Era Legendary music Director Sri Rajan (Nagendra) garu… organized by Vamsee International with the blessings of Sri Subbaramaireddy garu.Happy to perform Sri Rajan-Nagendra evergreen hits in the presence of Sri Konijeti Rosaiah , Telangana Govt Representative Dr. S. Venugopala Chary garu, great Director Sri Kodanda Ramireddy garu, Producer and Director Sri Yvs Chowdary garu,…ATA President Satyanarayana Reddy Kandimalla, with great singers..Ramana Ceelam, Praveen Kumar Koppolu, Vinod Babu Bayya and musicians Aravind Sowoji, Nvp Saiprasad, Tatikonda Mohan, Prem Pren Kumar Bhandaru, Yugandhar Flute, Krishna Pads, Srinivas Reddy, Paul Raj tabla, Sunny Anantarapu, Special Thanks to Safe Ngo Bharadwaj garu, Vamsee Ramaraju, Sailaja Sunkarapalli, Photos by Subrahmanyam and Venu garu…,Telugu review by Venu Gopal garu __/\__ 💖 హోళీ రోజున.. రంగుల వర్షం 💖 💖 రాజన్-నాగేంద్ర పాటలతో హర్షం 💖 సుమధుర సుస్వర సంగీత దర్శకులు శ్రీ రాజన్ (నాగేంద్ర సోదరులు) గారికి “జీవిత సాఫల్య పురస్కారం ” అనే ఈ కార్యక్రమం 1-3-2018 న 4 గం.లకు హైదరాబాద్ రవీంద్రభారతి లో చాలా వైభవంగా జరిగింది. ఈ సభలో అమెరికా నుండి వచ్చిన తెలుగు కోకిల “గాన విశారద” శ్రీమతి “శారద ఆకునూరి” గారు వారి బృందం “వీణ వేణువైన సరిగమ విన్నావా” అంటూ నాలుగు గంటలకు పైగా తమ గళామృతంతో హోళి పండగ రోజును రంగుల వర్షం కురిపించారు.. శ్రీ కొణిజేటి రోశయ్య గారు, శ్రీ ఏ.కోదండరామిరెడ్డి గారు, శ్రీ వై.వి.ఎస్. చౌదరి గారు, ఇంకా కొంతమంది ప్రభుత్వ ప్రతినిధులు, అమెరికా నుండి విచ్చేసిన అతిథుల మధ్య ఆట్టహాసంగా జరిగింది. ఎన్ని సుమధురమైన పాటలో అందులో కొన్ని.. “మానసవీణా.. మధుగీతం..” ” మల్లి..మల్లి.. నా నాగమల్లి..” “మధువనిలో రాధికవో..” “రాగమో.. అనురాగమో..” “ఆ పొన్న నీడలో..” ” మేఘాల పందిరిలోన..” “చినుకులా రాలి” “పూజలు సేయ పూలు తెచ్చాను” “అబ్బో నేరేడు పళ్ళు.. ” ” ఆకాశ వీధులలోన..” “కాస్తందుకో.. దరఖాస్తందుకో.. ” ఇలా చాలా మధురమైన తెలుగు పాటలతో పాటు శారద గారు రెండు కన్నడ పాటలను కూడా పాడి అలరించారు. ❣️ గాయకులు వినోద్ బాబు గారు, రమణ గారు, ప్రవీణ్, మాధవ్ గార్లు చాలా బాగా పాడారు. ❣️ ఈ కార్యక్రమంలో “పాడుతా తీయగా”, “స్వరాభిషేకం” ఫేం శ్రీ అరవింద్ గారి ఆర్కెస్ట్రా ప్రతీ పాట ఒరిజినల్ పాటకు ఏమాత్రం తేడా తెలియనంతగా సంగీతాన్ని అందించడ వారి ప్రత్యేకత. ❣️ ఈ కార్యక్రమంలో శ్రీ రాజన్ గారు మొదటి పాట నుండి, చివరి పాట వరకు సభలో కూర్చుని ప్రతి పాటను ఆస్వాదించారు, 85 ఏళ్ళ వయసులో దాదాపు 4 గంటలపైగా కూర్చుని అంత శ్రద్ధగా వినడం అద్భుతమనిపించింది. ❣️ మామూలుగా ఇటువంటి సభలకు వచ్చే అతిథులు ఏదో మొక్కుబడిగా వచ్చి మాట్లాడి వెళ్ళిపోతారు కానీ విచిత్రంగా అడిగి మరీ పాటలు పాడించుకున్నారు అంటే గ్రేట్.. ❣️ శ్రీ రోశయ్య గారు, శ్రీ వేణుగోపాలా చారి గారు “వీణ వేణువైన సరిగమ విన్నావా” పాటను కోరి మరీ పాడించుకున్నారు. ఇక చివరగా రాజన్ గారిని కలవడం, వారితో మాట్లాడి ఫోటో తీయించుకోవడం శ్రీమతి శారద ఆకునూరి గారు మాకు కలిగించిన అదృష్టం.