Tribute to Great Legendary Musician and Composer Sri Mangalampalli Balamurali Krishna garu. Blessed to have sweet memories with him.
వాగ్గేయకారులు, సంగీత స్వర చక్రవర్తి శ్రీ మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారికి నివాళి
ఆయన్ని సరస్వతి పుత్రులు అని కొందరంటే…ఆయన్నే సరస్వతి దేవి ఆవహించింది అని మరికొందరు అన్నారు…శాస్త్రీయ సంగీతాన్ని పండిత పామరులకు సమతుల్యంగా రుచి చూపించిన మహానుభావులు ఆయన …శాస్త్రీయమే కాకుండా “మౌనమే నీ భాష ఓ మూగ మనసా”, “ఏటి లోని కెరటాలు ఏరు విడిచి పోవు”, “నీవు నేను వలచితిమి”, “సలలిత రాగ సుధారస గానం” , “వసంత గాలికి వలపులు రేగ” వంటి ఎన్నో మంచి సినీ గీతాలతో మన మనస్సులో ఎప్పటికీ స్థిరంగా ఉండిపోయారు




