About

Sarada Akunuri

She has been an active member of Telugu Cultural Association of Greater Houston and served as Cultural Secretary and President

Sarada Akunuri

Sarada is a versatile singer and started singing at an early age and has performed in a number of programs on All India Radio such as Yuvavani where she sang Lalitha Geetalu and performed On-Air Natikalu. Sarada also participated in a number of cultural programs while attending Padmavathi Mahila University in Tirupati.

Sarada Akunuri
Sarada Akunuri

Sarada started her television career by participating and winning  in ETV’s Sarigamalu competition and also in Gemini TV’s Navaragam. She was an announcer/news-reader/game-host/Interviewer in Doordarshan and Siti cable programs. She interviewed film personalities such as KM Radhakrishnan ,Raja, Jagapathi babu, Koti etc., as well as noted Doctors and industrialists.  

After moving to America, Sarada continued to actively participate in performing at a variety of concerts in Hindi, Telugu, Tamil, Kannada and Malayalam. Sarada performed at the ATA conference in Chicago and NATA conference in Houston. Sarada has also performed at a few movie events such as Happy Days 50 days’ celebrations in Dallas where Sekhar Kammula was present.  She performed along with well-known Telugu Cinema play back singers  including P. Suseela, Ramakrishna, Jamunarani, Nagurbabu(Mano), Mallikarjun, SriKrishna, Balakameswararao, Gangadhar, Sivareddy, Rama chary, Indian Idol Revanth, Hema Chandra etc. Recently rendered a song for a Telugu film as a playback singer.

Sarada-Akunuri

Sarada has been an active member of Telugu Cultural Association of Greater Houston and served as Cultural Secretary and President for two years from 2011-2013.  She also served as a Cultural Chairperson for TANA Chaitanya Sravanthi and organized a number of events in India.   She served as TANA Convention Cultural Chair held in Dallas in May 2013.   Sarada helped organize ETV’s Padutha Teeyaga live shows in Houston and Austin and also seved as a Cultural team member in NATA 2014 convention. She recently served as a Cultural Chair for the American Telangana Association’s World Convention held in Houston in 2018.

Sarada performed as the lead singer in a number of prestigious concerts in India including Dadasahebphalke awardee ANR’s 90th birthday celebrations, Pendyala Award presentation to SPB, Adurthi award to actress Jamuna, Life Time achievement award to comedian Ali, Tribute to Director Balachander concert,  Director Dasari Narayana Rao’s Swarabhishekam and great music director Rajan Nagendra’s music concert.  She has also performed in a concert where Pride of India cinema awards were presented to Kalatapasvi Sri K. Viswanath and Singeetham Srinivasa Rao. Sarada has performed in Veturi Puraskarams concerts in a row for the year 2016 and 2017. 

Sarada has been invited by Andhra social cultural association Chennai to perform in front of the Great music director Sri. MS Viswanathan.

She was featured as one of nine US based personalities at Telugu Times 9th Anniversary edition.  She received an award for “commitment and contribution to the empowerment of women” from Singer P.Suseela in Dallas Mahila Sambaralu.  She also received TANA community Service Award from Dadasheb Phalke awardee Padmabhusham Sri Akkineni Nageswararao garu.  She received Vamsee Ugadhi puraskaram for the year 2014 along with other eminent personalities like music directors Koti and Mani Sarma.She received NATA-ANR “Gana Ratna” award in NATA convention 2014. She received “America Gana Kokila” Award from Vastavam.net in New Jersey in 2017.  She received “Gandharva Rasavarshini” award from Pragnika foundation, Hyderabad in 2018.

Sarada-Akunuri
Sarada Akunuri

In addition to being a singer, Sarada is also deeply involved in Telugu literature.  She received the first copy of the books by Dr. C. Narayana Reddy’s “Kshetrabandham” and Malladi Ramakrishna Sastry’s “Madi Sarada Devi Mandirame”.  She has Published few books,  “Nela Meedi Jabilli “ book on music inaugurated by Singer Bala Subrahmanyam. “Sari Leru Neekevvaru”  was inaugurated by Padmabhushan Singer Suseela on the occasion of  great music director KV Mahadevan’s centennial. and the proceedings from the sale of these books were dedicated to Differently Abled Kids. Recently release a great book on Lyricist Dasaradhi.

She is currently serving as the President for Akkineni foundation of America and Board of Director  for Telugu Bhavan organization.  Sarada currently entertains Houston Telugu community as a radio jockey in a Houston based Telugu radio.   

ఉదాత్త సాహిత్యంతో సృష్టించిన సినీ గీతాలంటే ఎంతో అభిమానం, ఇంకా ఇంగ్లీష్ లో చెప్పాలంటే “PASSION ” ఉన్న ప్రముఖ గాయని శ్రీమతి శారద ఆకునూరి. శ్రీ మృత్యుం జయరావు, శ్రీమతి రమాదేవి దంపతులకు తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జన్మించిన శారద ఆకునూరి , గుంటూరు జిల్లా బాపట్ల లో మరియు చిత్తూరు జిల్లా తిరుపతిలోనూ విద్యనభ్యసించారు. మూడేళ్ళ లేలేత ప్రాయం లోనే పాటలు పాడటం అభ్యసించిన వీరు భక్తి లలిత, సినిమా పాటల పోటిలలో అనేక మార్లు రాష్ట్రస్థాయి బహుమతులను గెలుచుకున్నారు. వ్యాసరచన మరియు నృత్య పోటీల్లో పాల్గొని పలువురి ప్రముఖుల ప్రశంసలందు కొన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం లో యువవాణి కార్యక్రమం లో లలిత గీతాలు ఆలపించి అతికొద్ది కాలంలోనే రేడియో ఆడిషన్ లో కృతార్ధురాలై రేడియో గాయని గా అనేక లలిత గీతాలు ఆలపించారు. ఇవేకాక స్నేహం, అక్షరాస్యత మీద అనేక యువవాణి రేడియో నాటికలలో ప్రధాన పాత్ర పోషించారు. తన గాత్రం తో ఆకాశవాణి శ్రోతలతో పాటు టీవి ప్రేక్షకులను కూడా ఈ టీవి వారి సరిగమలు సినిమా పాటలు, సినిమాల క్విజ్ లో ప్రథమస్థానం, జెమినీ టీవి వారి నవరగంలో పాల్గొని అలరించారు. హైదరాబాద్ దూరదర్శన్ లో టెలీ స్కూల్ కార్యక్రమాలు, మహిళా కార్యక్రమాల తో పాటు పలు సినీ ప్రముఖులు, జగపతిబాబు, KM రాధాకృష్ణన్, రాజా, కోటి గారు వంటి వారిని, ప్రముఖ పారిశ్రామిక వేత్తలను ఇంటర్వ్యూ చేసి తన ప్రశ్నావళి ద్వారా ప్రముఖుల అంతరంగాలను అద్భుతంగా ఆవిష్కరించారు. సిటీ కేబుల్ న్యూస్ రీడర్ గా, గేమ్ షో హోస్ట్ గా, యాంకర్ గా ప్రేక్షకాభిమానాన్ని పొందారు.

అమెరికాలో చదువుకొని, స్థిరపడిన శ్రీ శ్రీనివాస్ ఆకునూరిని వివాహం చేసుకొని అమెరికాలో అడుగుపెట్టినా తన తెలుగు భాష సంస్కృతిని అక్కడ కూడా పరిరక్షించాలి, పెంపొందించాలి అనే సదుద్దేశంతో హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి లో సాంస్కృతిక కార్యదర్శి గా చేసి, తర్వాత రెండు సంవత్సరముల పాటు అధ్యక్షురాలిగా పనిచేసారు.ఆ నేపధ్యం లో మన సంస్కృతికి అద్దంపట్టే పండుగలు సంక్రాంతి, ఉగాది తో పాటు వాగ్గేయకారోత్సవం, సిద్ధేంద్రయోగి జయంతోత్సవం, వనభోజనాలు, ఇమ్మిగ్రేషన్ సెమినార్ వంటి ఎన్నో మంచి కార్యక్రమాలను రూపొందించారు. ఇదే కాక మీనాక్షి దేవస్థానం వారి VEDIC HERITAGE SCHOOL లో రామాయణం, భారతం, భాగవతం భోధించే అధ్యాపకురాలిగా పనిచేసారు. హ్యూస్టన్ తెలుగు రేడియో లో రేడియో జాకీగా శ్రోతలకు అలనాటి మధురగీతాలను వినిపిస్తూ మెదడుకు పదును పెట్టె  పోడుపుకధలతో రకరకాల ఆటలతో ప్రతి శనివారం అలరిస్తారు. అమెరికా రేడియో లో మొట్టమొదటి సారిగా పాటలు పోటీలు నిర్వహించి భళా అనిపించుకున్నారు. 19 వ TANA ద్వైవార్షిక సభలకు కల్చరల్ చైర్ గా, NATA మహాసభల్లో సాంస్కృతిక కార్యదర్శి గా వ్యవహరించారు. TANA చైతన్య స్రవంతి కి సాంస్కృతిక కార్యదర్శి గా ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాలలో భాష, సంస్కృతి సేవ పరమైన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటీవల జరిగిన 20 వ TANA మహాసభల్లో దీంతానా అడ్వైసర్ గా వుండి సంగీత పోటీలు నిర్వహించారు.

అమెరికా లో ఉంటూ కూడా తనకు పాటల పట్ల ఉన్న మక్కువతో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో, అమెరికా లో ఉన్న అన్ని నగరాల్లో, కెనడా లో, ఇండియా లో వందలాది విభావరుల్లో పాల్గొన్నారు. P సుశీల, కోకా జమునారాణి, రామకృష్ణ మనో, ఘంటసాల రత్నకుమార్, మల్లికార్జున్, శ్రీకృష్ణ, హేమచంద్ర వంటి ప్రముఖ నేపధ్య గాయనీ గాయకులతో గొంతు కలిపి ఎన్నో సంగీత విభావరులు చేసి సంగీత ప్రియుల ప్రసంశలు అందుకున్నారు. అమెరికాలో బహుళ ప్రజాదరణ పొందిన తెలుగు టైమ్స్ పత్రిక 9 వ వార్షికోత్సవం సందర్భంగా, అమెరికాలో 9 మంది ప్రముఖుల జాబితాలో వీరు ఉండటం విశేషం.

డల్లాస్ లో జరిగిన అంతర్జాతీయ మహిళా సంబరాల్లో “commitment and contribution to the empowerment of women” పురస్కారాన్ని మధుర గాయని P.సుశీలగారి తో, అక్కినేని గారి 89 వ పుట్టిన రోజు సందర్భంగా TANA కమ్యూనిటీ సర్వీస్ పురస్కారాన్ని శ్రీ అక్కినేని నాగేశ్వరరావు చేతులమీదుగా అందుకున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత శ్రీ ANR గారి 90వ పుట్టిన రోజు, పద్మశ్రీ SP బాలు గారికి పెండ్యాల పురస్కారం, అందాల నటి జమున గారికి ఆదుర్తి పురస్కారం, ప్రముఖ నటులు కోట శ్రీనివాస్ రావు గారికి అల్లురామలింగయ్య పురస్కారం, కమెడియన్ అలీ కి lifetime acheivement పురస్కారం, సేఫ్ NGO వారి వేటూరి గీతాంజలి, దర్శకరత్న దాసరి స్వరాభిషేకం, ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ రాజన్ గారి సమక్షంలో జరిగిన రాజన్ – నాగేంద్ర సినీగీత వైభవం, స్వర్ణయుగ సంగీత దర్శకులు సత్యం , రమేష్ నాయుడు, మహదేవన్, ప్రముఖ గీత రచయితలు దాశరధి, సినారె వేటూరి వంటి వారికి పూర్తిస్థాయి ప్రతిష్టాత్మక సంగీత విభావరులలో ప్రధాన గాయనిగా పాల్గొని అశేష అభిమానులను చూరగొన్నారు. 2014 లో మెలోడీ బ్రహ్మ మణిశర్మ, సుస్వరాల కోటి గారితో పాటు వంశీ వారి ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. ప్రయోగాల సంగీత దర్శకులు శ్రీ MS విశ్వనాథన్ సమక్షంలో చెన్నై లో ఆంధ్ర కల్చరల్ క్లబ్ వారు నిర్వహించిన సంగీత విభావరిలో పాల్గొని ఆయన చేతుల మీదగా పురస్కారం స్వీకరించారు.

సంగీతమే కాకుండా సాహిత్యం మీద కూడా మక్కువ కలిగిన శారద ఆకునూరి గారు పలు పుస్తకాల ప్రచురణకు సహాయ సహకారాలు అందించారు. డా! సి. నారాయణ రెడ్డి గారి గారి “క్షేత్ర బంధం” కవిత సంపుటి మొదటి ప్రతిని ఆయన చేతుల మీదుగా అందుకున్నారు. మల్లాది రామకృష్ణ గారి “మది శారద దేవి మందిరమె ” మదిలో వీణలు మ్రోగే… దాశరధి గారి పుస్తకాలు ప్రచురణలో ప్రధాన భూమిక గా ఉండి మొదటి ప్రతులను అందుకున్నారు. “నేలమీది జాబిలి నింగి లోని సిరిమల్లె” అక్కినేని శత గీత లహరి పుస్తకాన్ని ప్రచురించి దాని పై వచ్చే ఆదాయం వృద్ధ కళాకారులకు చెందేటట్లు చేశారు. సంగీత దర్శకులు శ్రీ KV మహదేవన్ శతజయంతి సందర్భంగా “సరిలేరు నీకెవ్వరూ..మహదేవన్ ఆణిముత్యాలు” పేరిట పుస్తకాన్ని ప్రచురించి దానిపై వచ్చే ఆదాయం వికలాంగులకు చెందేటట్లు చేశారు. మహదేవన్ గారి మీద పుస్తకం తెలుగు రాష్ట్రాలలో లైబ్రరీలకు ఎంపిక అయినది. వికలాంగుల సహాయార్ధం వేగేశ్న ఫౌండేషన్ తరపున అమెరికాలో ఇరవై ఐదు నగరాల్లో జరిగిన ఘంటసాల ఆరాధనోత్సవాలు మరియు బాలు సంగీతోత్సవాల్లో ప్రధాన గాయనిగా పాల్గొని ఆ కార్యక్రమాలు విజవంతం కావడానికి సహకరించినందుకు గాను సంస్థ నిర్వాహకులు ఆమెను “గాన రత్న ” పురస్కారం తో సత్కరించారు. వాస్తవం మీడియా /పత్రిక వారు “అమెరికా గాన కోకిల” బిరుదుతో సత్కరించారు. ప్రాగ్నిక ఫౌండేషన్ హైదరాబాద్ వారు “గాంధర్వ రస వర్షిణి” బిరుదు తో సత్కరించారు. అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికాలో అధ్యక్షురాలిగా పలురకాలైన ప్రజోపకరమైనటువంటి, నాగేశ్వరరావు గారిని గుర్తుకు  తీసుకువచ్చే ముఖ్య కార్యక్రమాలను రూపొందిస్తూ వివిధ రంగాల్లో లజ్జ ప్రతిష్టులైన వారికి పురస్కారాలు అందజేస్తు కీలక పాత్ర పోషిస్తున్నారు.

Sarada Akunuri

It's just a numbers.

Events
0 +
Songs
0 +
Countries
0 +

Sarada Akunuri has been an active member of Telugu Cultural Association of Greater Houston and served as
Cultural Secretary and President