Happy birthday to Lyricist Sri Bhuvanachandra

Happy birthday to Lyricist Sri Bhuvanachandra gaaru. ప్రముఖ సినీ పాటల రచయిత, ఆత్మీయ స్నేహితులు శ్రీ ఊర కరణం పూర్ణానంద ప్రభాకర గురురాజు గారికి హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. 
బాణీలకు వేగంగా పాటలు రాయడంలో అగ్రశ్రేణిలో ఉండడంతో పాటు, “గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట ” “బంగారు కోడిపెట్ట ” “వాన వాన వెల్లువాయే కొండా కోన తుళ్ళిపోయే” వంటి మాస్ పాటలు కమర్షియల్ గా రాసినా తనకిష్టమైన మాధుర్యానికి కూడా పెద్ద పీట వేసి “బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట” “మరల తెలుపనా” వంటి చక్కటి మధురగీతాలు రాసి మన మనస్సులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. నాకు ఎంతో ఇష్టమైన అతి చక్కటి స్నేహ గీతం “స్నేహానికన్నా మిన్న లోకానలేదురా”.
Scroll to Top