మా ఊరి కోయిలమ్మ – By: Uma Bharathi

పేరులో ‘ఎంతో’ ఉంది..
…………………………….
మా ఊరి కోయిలమ్మ..
…………………………….
‘శారద’ ..మా అమ్మ పేరు.. ఆ పేరు అంటేనే నాకు చాలా ఇష్టం… ‘అమ్మ’ లానే ఆ పేరులోనూ నాకు ఓ ఆత్మీయత, ఓ అనుబంధం తోస్తుంది. ఆ పేరున్న మహిళని ఎవరిని కలిసినా రెప్పపాటు నా మనసున ఓ తెలియని అనుభూతి అయితే తప్పక కలుగుతుంది..ఆ క్షణాన మా అమ్మ గుర్తుకొచ్చి..
ఆ తరువాత వారి వ్యక్తిత్వాన్ని బట్టి వారితో పరిచయం పెంచుకోవాలన్న తపన కూడా.
నటి ఊర్వశి శారదతో చిన్నతనంలో నాకున్న కొద్ది పరిచయం… జరిగిన సంఘటనలతో ఆమె పట్ల గౌరవం, ఇష్టం పెరిగాయి..
అలాగే ప్రముఖ రచయిత్రి శారద పోలంరాజు గారితో పరిచయం ఓ గొప్ప అనుభూతి. ఆమెని చూస్తూనే ఓ పూజ్య భావంతో చేతులు జోడించవచ్చు. మొన్న ఆగష్టులో ఆమె మా కార్యక్రమానికి రావడం, ఆమెకు నేను పద్యకధ బహుమానం అందజేయడం ఒక blessing..
**శారదపూర్ణ సొంటి గారు కూడా అటువంటి గొప్ప పేరున్న రచయిత్రి..స్నేహమయి. ఆవిడంటే కూడా నాకు చాలా గౌరవం, ఆత్మీయత…
…..
మా ఊరి కోయిలమ్మ శారద అకునూరితో పరిచయం, ఎరుక, స్నేహం.. ఆనందంగా కళాత్మకంగా కొనసాగుతూనే ఉంది.
కళకి, కళారాధనకి సరిహద్దులు కాని, కాలపరిమితులు గాని లేవు అనడానికి మా ఈ శారదమ్మ ఓ మంచి నిదర్శనం… ఆమె గానం పట్ల ఆమెకున్న చిత్తశుద్దికి, పట్టుదలకి ‘జైహో’ జోహార్లు చెప్పవలసిందే..మరి..
 
మొన్న 24 న… శారద TK గారి పుస్తకావిష్కరణ సందర్భంగా తన గానంతో అతిధులని అబ్బురపరిచారు..
ఆమె, నేను ఒకే ఊరి వాళ్పం. ఒకరికొకరం స్పూర్తిగా పరస్పర స్నేహ భావంతో… కొనసాగుతాం…
శారద’ అన్మ నామధేయంలోనే నాకో ప్రత్యేకత తోస్తుంది మరి..
……
మా ఊరు తెలుగు కళలకి, కళాకారులకి, గానకోకిలకి ప్రఖ్యాతి అని మనవి చేసుకుంటున్నాను.
మా ఊరి ఇతర గాయనీ మణులని కూడా మీకు ఇక్కడ పరిచయం చేయాలని కోరిక..
Scroll to Top